రోజూ ఇలా చేయండి.. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది…!

-

ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని కోరుకుంటారు. లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే ఇక ఏమీ అక్కర్లేదు లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే కొన్ని పొరపాట్లు చేయకూడదు. కొన్ని పొరపాట్లు చేయడం వలన లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్లిపోతుంది. రోజు సాయంత్రం పూట ఆవనూనెతో దీపాన్ని వెలిగించి అందులో రెండు లవంగాలని వేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది. ఇంటి ముఖద్వారానికి రెండు పక్కలా రెండు దీపాలన్ని పెట్టి అందులో లవంగాలని వేయండి.

ఇలా ఆవనూనెతో లవంగాలని వేసి దీపం పెట్టడం వలన చక్కటి ఫలితం ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. లక్ష్మీదేవి ఉంటుంది కర్పూరం కూడా మీకు లక్ష్మీదేవిని ఇంటికి తీసుకురావడానికి సహాయపడుతుంది. కర్పూరంతో వాస్తు దోషాలు కూడా పోతాయి ప్రతికూల శక్తి కూడా ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. కర్పూరాన్ని వెలిగించి రెండు లవంగాలని కనుక అందులో వేసినట్లయితే కచ్చితంగా ప్రతికూల శక్తి వెళ్ళిపోతుంది అంతా మంచి జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.

డబ్బుకి ఎలాంటి లోటు కూడా ఉండదు. కర్పూరం వలన పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి వస్తుంది. చక్కగా సంతోషంగా ఉండొచ్చు. చాలా మంది గోమాతని పూజిస్తారు గోమాతలో ఉన్న అన్ని దేవుళ్ళు సంతృప్తి చెంది లక్ష్మీదేవి మీ ఇంటికి రావాలంటే గోమాతకి ఆహారాన్ని పెట్టండి పక్షులకి ఆహారం పెడితే కూడా లక్ష్మీదేవి వస్తుంది. పుణ్యం వస్తుంది. శ్రేయస్సు ఉంటుంది చీకటి పడ్డాక అస్సలు ఇల్లు తుడవకండి. చీకటి పడ్డాక కనుక ఇల్లును తుడిచినట్లైతే లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్లిపోతుందని గుర్తు పెట్టుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news