తెలంగాణకు 4 రోజుల పాటు వర్ష సూచన !

-

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలెర్ట్. తెలంగాణకు నాలుగు రోజుల పాటు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈదురు గాలులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.

rain
Heavy rains today and tomorrow These are the toll-free numbers

 

సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, సంగా రెడ్డి, మెదక్, సూర్యపేట, నిజామాబాద్, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో వానలు ఎడతెరిపి లేకుండా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. సుమారు గంటకు 40 కిలోమీటర్లు వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలియజేశారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని చెబుతున్నారు. రేపు, ఎల్లుండి కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news