తెలంగాణ, ఏపీ ప్రాంతాలకు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. అండమాన్ సమీపంలో తుఫాన్ ఆవర్తనాలు ఉన్నట్లు తేలింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈనెల 22న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరింది. వాయువ్య దిశగా పయనిస్తూ వాయుగుండంగా మారుతుందని ఐఎండీ అంచనా వేసింది.
దీని ఎఫెక్ట్ తో తెలంగాణ, ఏపీ ప్రాంతాలకు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా కోస్తాంధ్రకు మళ్ళీ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. వాయుగుండం హెచ్చరికలతో అలెర్ట్ అయ్యారు విశాఖ జిల్లా అధికారులు. కలెక్టరేట్ తో పాటు 13 తహశీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూం లు ఏర్పాటు చేశారు.
ఇక అటు అనకాపల్లి జిల్లాలో ఉధృతంగా పెద్దేరు వాగు…ప్రవహిస్తోంది. బుచ్చయ్య పేట (మం ) వడ్డాది దగ్గర కాజ్ వే నీట మునిగింది.