గ్రూప్ 1 పరీక్ష పై రేవంత్ కొత్త ప్లాన్..!

-

తెలంగాణలో గ్రూపు-1 మెయిన్స్  పరీక్షకు సన్నద్ధం అవుతున్న అభ్యర్థులు కాస్త తర్జన భర్జన పడుతున్నారనే చెప్పాలి. ఓ వైపు కొంత మంది అభ్యర్థులు గ్రూపు-1 పరీక్షలను రీ షెడ్యూల్ చేయాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. జీవో నెం.29ని రద్దు చేయాలని కొంత మంది డిమాండ్ చేస్తుంటే.. మరికొందరూ చదువుకునేందుకు కాస్త సమయం కావాలని కూడా కొందరూ మీడియా ముందు తమ సమస్యను చెప్పుకున్నారు.

ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం గ్రూపు-1 పరీక్ష యదావిధిగా జరుగుతుందని ప్రకటించారు. ప్రకటించిన కొద్ది సేపటికే గ్రూపు-1 వాయిదా అని రూమర్స్ వచ్చాయి. హైదరాబాద్ మంత్రుల నివాస ప్రాంగణంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్లో సమావేశమయ్యారు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు.  మంత్రులు దామోదర్ రాజనర్సింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ సమావేశంలో పాల్గొన్నారు. గ్రూప్ 1 పరీక్షలు, జీఓ 29 అంశం, గ్రూప్ 1 అభ్యర్థులు చేస్తున్న విజ్ఞప్తులు, అభ్యంతరాలు, సాధ్యాసాధ్యాలపై సుదీర్ఘంగా చర్చించారు మంత్రులు.

ఇదిలా ఉంటే.. సీఎం  రేవంత్ రెడ్డి పంతానికి పోతున్నారనే చెప్పాలి. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష వాయిదా వేసే ఆలోచన అంటూ తొలుత మీడియా కు లీకులు ఇచ్చారు. ఇంతలోనే వాయిదా వేసే ఆలోచన విరమించుకొని.. మంత్రులతో GO. 29 మంచిదని అభ్యర్థులకు నచ్చజెప్పేలా చెప్పించనున్నట్లు సమాచారం. గ్రూపు-1 అభ్యర్థులు కొంత మంది మాత్రం 1నెల రోజుల సమయం అదనంగా ఉంటే ప్రీపెర్ అవ్వడానికీ  వీలుంటుందని భావిస్తున్నారు. ప్రభుత్వం ఫైనల్ గా ఏమి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి మరీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version