తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో వచ్చే ఐదు రోజుల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ముఖ్యంగా ఇవాళ, రేపు భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, KMM, NLG, సూర్యాపేట, అదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు మొన్నటి నుంచి హైదరాబాద్ లో వర్షాలు కురుస్తున్నాయి. సాయంత్రం వేళనే హైదరాబాద్ లో వర్షాలు పడుతున్నాయి.