తెలంగాణ రాష్ట్ర ప్రజలను వర్షాలు వదలడం లేదు. గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఇక తాజా సమాచారం ప్రకారం… తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మరియు రేపు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది.
హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటన ప్రకారం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడనున్నాయి. ఇక ఇవాళ అదిలాబాద్, అసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలంతు జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక నిన్నటి రోజున హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే.