తెలంగాణ రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మళ్లీ రైతుల ఖాతాలలో రైతుబంధు వేసేందుకు సిద్ధమైంది. సాంకేతిక సమస్యలతో రైతుబంధు సాయం అందని వారికి తిరిగి ఖాతాలలో నగలు జమ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ ప్రకటన చేసింది. నిర్వహణలో లేని బ్యాంకు అకౌంటు నెంబర్, బ్యాంకు ఖాతా క్లోజ్ కావడం, ఫ్రిజ్ అవ్వడం లాంటి కారణాలతో పలువురు రైతులతో సహాయం అందలేదని వెల్లడించింది వ్యవసాయ శాఖ.
బ్యాంక్ అధికారులతో సంప్రదించి ఖాతా వివరాలు సరిచేసిన తర్వాత రైతుల ఖాతాలను డబ్బులు జమ చేస్తామని పేర్కొంది. కాగా నిన్నటి నుంచి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొంతమంది రైతులకు రైతుబంధువేసి తర్వాత వెనక్కి తీసుకుంది రేవంత్ రెడ్డి సర్కార్. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 30 నుంచి 40 వేల మంది రైతులు రైతుబంధు వెనక్కి వెళ్లిందట. దీంతో రైతన్నలు గగ్గోలు పెట్టారు. ఈ తరుణంలో దిగివచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ వారి ఖాతాలలో రైతుబంధు వేస్తామని ప్రకటన చేసింది.