తెలంగాణ రైతులకు అలర్ట్.. రైతు బీమా దరఖాస్తు నేడే లాస్ట్ కానుంది. రైతు బీమాకు అర్హులైన రైతులు సంబంధిత అధికారులకు కావలసిన పత్రాలను సమర్పించి దరఖాస్తు పూర్తి చేసుకోవచ్చు. ఈ ఏడాది జూన్ 18 లోపు పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన వారిలో 18 నుంచి 59 ఏళ్ల వయసు గలవారు తమ గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారికి దరఖాస్తు ఇవ్వాలి.
తద్వారా వారికి ఆగస్టు 13 నుంచి ఏడాది పాటు జీవిత బీమా ఉంటుంది. ఏ కారణంగా చనిపోయిన రూ. 5 లక్షల పరిహారం అందుతుంది.
ముఖ్య సూచనలు
జూన్ 18 వరకు పట్టాదారు పాస్బుక్ పొందినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
పట్టాదారు పాసు పుస్తకం, బ్యాంకుఖాతా, నామిని ఆధార్ జిరాక్స్ పేపర్ ను స్థానిక ఏవోలకు అందజేయాలి.