లావణ్యకు రాజ్‌ తరుణ్… అబార్షన్ చేయించాడా ?

-

రాజ్‌ తరుణ్ నాకు అబార్షన్ చేయించాడు అంటూ లావణ్య సంచలన వ్యాఖ్యలు చేసారు. టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ వ్యవహారంలో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు కొనసాగుతున్నాయి. రాజ్‌తరుణ్‌తో పదేళ్ల క్రితమే తనకు వివాహామైందని లావణ్య ఆరోపించారు. అన్విక పేరుతో తాను రాజ్‌తరుణ్ విదేశాలకు కూడా వెళ్లామని తెలిపారు.

Raj Tarun and Lavanya

అదే విధంగా కొన్నాళ్ల క్రితం అతను తనకు అబార్షన్ చేయించాడని.. దీనికి సంబంధించిన మెడికల్ డాక్యుమెంట్స్, ఆస్పత్రి వివరాలను పోలీసులకు సమర్పించినట్టు లావణ్య వెల్లడించింది.

11 ఏళ్లుగా రాజ్‌తరుణ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నాను… గుడిలో పెళ్లి కూడా చేసుకున్నాం. కానీ తన సినిమాలో నటిస్తున్న హీరోయిన్ తో అఫైర్‌ పెట్టుకొని నన్ను వదిలేశాడని ఆగ్రహించింది. 3 నెలల క్రితం రాజ్ ఇంటి నుంచి వెళ్లిపోయి దూరంగా ఉంటున్నాడు….రాజ్‌ను వదిలేయకపోతే చంపేసి బాడీ కూడా మాయం చేస్తామని బెదిరిస్తున్నారని మండిపడింది.  రాజ్‌ తరుణ్‌ నా ప్రపంచం..రాజ్‌ నాకు కావాలి….నాకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేసింది లావణ్య.

Read more RELATED
Recommended to you

Latest news