బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రూ. 5 నుండి 10 కోట్లకు కొంటున్నాం – రాజగోపాల్‌ రెడ్డి

-

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రూ. 5 నుండి 10 కోట్లకు కొంటున్నామంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్‌ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి. తాజాగా మీడియా చిట్‌ చాట్‌ లో కాంగ్రెస్‌ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మంత్రి పదవి కోసం పైరవీ చేయడం లేదు… ఒకవేళ చేస్తే నేనే సీఎం అయ్యే వాడిని కాదు అని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కేవలం రూ. 5 నుండి 10 కోట్లకు కొంటున్నామని బాంబ పేల్చారు.

rajagopal reddy ,brs mlas

మంత్రి పదవి కోసం తాను పైరవీ చేయడం లేదని, పైరవీ చేస్తే తానే ముఖ్యమంత్రి అవుతానని వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. అసెంబ్లీ లాబీలో బీఆర్ఎస్ నేతలతో మాట్లాడుతూ గేమ్ ఇప్పుడు స్టార్టయ్యిందని, మేం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కేవలం రూ.5-10 కోట్లకు కొంటున్నామని చెప్పారు. అందుకే మా దగ్గరకు 26 మంది ఎమ్మెల్యేలు ఇంకా రాలేదని.. ప్రశాంత్ రెడ్డి వంటి నేతలను మేం కొనుగోలు చేయలేమని తేల్చి చెప్పారు కాంగ్రెస్‌ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version