BREAKING : లారీని ఢీకొట్టిన బైక్‌.. ముగ్గురు యువకులు స్పాట్ డెడ్

-

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కంది మండలం తునికిళ్ల తండా శివారులో లారీని వెనుక నుంచి బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. నాందేడ్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న లారీని వెనుక నుంచి ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల వివరాల కోసం ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘ఇవాళ తెల్లవారుజామున ముగ్గురు యువకులు ఒకే బైక్పై వెళ్తున్నారు. తునికిళ్ల తండా శివారులోకి రాగానే లారీని వెనక నుంచి ఢీకొట్టారు. ఈ ఘటనలో ముగ్గురు స్పాట్ డెడ్ అయ్యారు. లారీ యజమాని ఆచూకీ కోసం చూస్తున్నాం. ఘటనాస్థలిలో సీసీటీవీ కెమెరాలు ఏవైనా ఉన్నాయో చెక్ చేస్తున్నాం. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం.’ అని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version