ఉదయం మూత్రం పసుపు రంగులో వస్తుందా..? కారణాలు ఇవే కావొచ్చు..!

-

బాడీలో సరిపడా వాటర్‌ ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉండగలగుతాడు. డీహెడ్రేషన్‌ భారిన పడితే ఎన్నో సమస్యలు ఎదుర్కోక తప్పదు. అయితే కొంతమందికి ఉదయం మూత్రం పసుపు రంగులో ఉంటుంది. పసుపు రంగు మూత్రం వెనుక కొన్ని ఇతర సమస్యలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. వీటికి కారణాలు ఏంటి..? నివారించుకోవడం ఎలానో ఈరోజు చూద్దాం.!

ఉదయం వేళ మూత్రం పసుపు రంగులో రావడానికి గల కారణాలు..

  1. శరీరంలో నీటి కొరత ఉన్నప్పుడు మూత్రం పసుపు రంగులో వస్తుంది.
  2. కిడ్నీలో రాయి ఉన్నప్పుడు ఉదయం వేళ మూత్రం పసుపు రంగులో వస్తుంది. అటువంటి పరిస్థితిలో మూత్రం రంగు మారడంతో పాటు జననాంగంలో నొప్పి, మంట కూడా ఉంటుంది.
  3. గర్భిణులకు కూడా తెల్లవారుజామున మూత్రం పసుపు రంగులో వస్తుంది.
  4. ప్రేగులకు సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు మూత్రం పసుపు రంగులో వస్తుంది. ఈ సందర్భంలో వెంటనే వైద్యుడిని సంప్రదించవలసిన అవసరం ఉంది.
  5. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ చికిత్సలో ఉపయోగించే కొన్ని ఔషధాలను ఒక వ్యక్తి తీసుకున్నప్పుడు, ఆ వ్యక్తి మూత్రం రంగు మారుతుంది. ఉదయం నిద్రలేచిన తర్వాత అలాంటి వారి మూత్రం పసుపు రంగులో కనిపిస్తుంది.

పై కారణాల వల్ల మీకు మూత్రం పసుపు రంగులో ఉన్నట్లేతే… వైద్యుడిని సంప్రదించడంతో పాటు.. కొన్ని చిట్కాలు కూడా పాటిస్తే సమస్య నుంచి త్వరగా బయటపడొచ్చు. అవేంటంటే..

నీరు పుష్కలంగా తాగాలి- నీరు దాహం వేసినప్పుడు మాత్రమే కాదు.. విధిగా తాగాలని గుర్తుపెట్టుకోండి. రోజుకు కనీసం ఐదు లీటర్లకు తగ్గకుండా తాగాలి. అది కూడా ఒకేసారి కాదు.. ఉదయం లీటర్‌నర, భోజనానికి ముందు గ్లాసు తాగాలి. భోజనం చేసేప్పుడు అస్సలు వాటర్‌ తాగకూడదు. భోజనం అయిన గంట తర్వాత మళ్లీ వాటర్‌ తాగడం మొదలుపెట్టాలి.

ఆహారంలో విటమిన్ సి చేర్చుకోండి- విటమిన్‌ సీ అంటే రోగనిరోధక శక్తి పెంచే మంచి విటమిన్.. సిట్రస్‌ ఫ్రూట్స్‌లో విటమిన్‌ సీ ఎక్కువగా ఉంటుంది. ఈ ఫ్రూట్స్‌ తినడం వల్ల స్కిన్‌ కూడా బాగుంటుంది.

ఆహారంలో నిమ్మకాయను చేర్చుకోండి.
జామకాయ తినండి.
పెరుగు తినండి.
గ్రీన్ టీ కూడా తీసుకోండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version