BREAKING : మేడిగడ్డ సందర్శనకు బీజేపీ, BRS దూరం ఉండనున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ కుంగుబాటు, దానిపై విజిలెన్స్ విచారణ ఆ తర్వాత పరిణామాల గురించి అందరికీ తెలిసిందే.
ఈ నేపథ్యంలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలను మేడిగడ్డకు తీసుకువెళ్లాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధుల బృందం ఇవాళ సందర్శించనుంది. అయితే.. ఈ మేడిగడ్డ సందర్శనకు బీజేపీ, BRS దూరం ఉండనున్నాయి. మేడిగడ్డ సందర్శనకు కాంగ్రెస్ పార్టీతో పాటు సీపీఐ, mim పార్టీలు మాత్రమే వెళుతున్నాయి.