రాఖీ పండుగ వాతావరణం రెండు తెలుగు రాష్ట్రాలలో నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో రాఖీ పండుగ ఇవాళ అని కొందరు కాదు కాదు రేపు అని మరికొందరు చెబుతున్నారు. అయితే ఈనెల 31వ తేదీన అంటే గురువారం రోజున రాఖీ పండుగ నిర్వహించుకోవాలని బ్రాహ్మణ సేవా సమితి తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఉపేంద్ర శర్మ ప్రకటించారు. ఇక సెప్టెంబర్ 18వ తేదీన వినాయక చవితి విగ్రహాలు ప్రతిష్టించాలని వెల్లడించారు.
అదే రోజున వినాయక చవితి జరుపుకోవాలని సూచించారు. ఇక బతుకమ్మ అక్టోబర్ 14వ తేదీన జరుపుకోవాలని… అక్టోబర్ 20 మూడవ తేదీన దసరా పండుగ జరుపుకోవాలని ప్రకటించారు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అలాగే దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు సీఎం జగన్మోహన్ రెడ్డి. అందరికీ ఒక అన్నగా తాను అండగా ఉంటానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అంటూ పోస్ట్ పెట్టారు సీఎం జగన్మోహన్ రెడ్డి. మీరు నాపై చూపుతున్న ప్రేమాభిమానాలకు సదా కృతజ్ఞుడిని అని పేర్కొన్నారు. మీ సంక్షేమమే లక్ష్యంగా.. మీ రక్షణే ధ్యేయంగా పాలన సాగిస్తున్నందుకు సంతోషిస్తూ మీకు ఒక అన్నగా, ఒక తమ్ముడిగా ఎప్పుడూ అండగా ఉంటానని మాట ఇస్తున్నా అంటూ ఎమోషనల్ అయ్యారు సీఎం జగన్మోహన్ రెడ్డి.