Telangana: రాఖీ పండుగకు హాలిడే ఇవ్వాల్సిందే… తెరపైకి కొత్త డిమాండ్ !

-

రాఖీకి సెలవు ప్రకటించాలని తెర పైకి డిమాండ్ వచ్చింది. రాఖీ పండుగ సందర్భంగా సోమవారం తెలంగాణ ప్రభుత్వం ఆప్షనల్ హాలిడేను ప్రకటించింది. అయితే కొన్ని పాఠశాలలు సెలవు ఇవ్వలేదు. ప్రతి ఇంట్లో ఆడపిల్లలు జరుపుకునే రాఖీ పండుగకు సాధారణ సెలవు ప్రకటించాలని గెజిటెడ్ హెడ్‌మాస్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

ఆప్షనల్ హాలిడేను సాధారణ సెలవుగా మార్చాలని విజ్ఞప్తి చేసింది. ఏపీలో అయితే ఆప్షనల్ హాలిడే కూడా లేదు. మరి దీనిపై తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి. కాగా, ప్రతీ సంవత్సరం శ్రావణమాసంలో రక్షాబంధన్ ని జరుపుకుంటూ ఉంటాము. రక్షాబంధన్ నాడు ఎంత దూరంలో ఉన్న వాళ్లకైనా సరే విషెస్ ని పంపించడం, రాఖీ పంపించడం చేస్తూ ఉంటాము. దగ్గరగా ఉంటే స్వయంగా రాఖీ కట్టి సంతోషంగా జరుపుకుంటూ ఉంటాము. సోదరులు, సోదరీమణుల ఎంతగానో ఎదురు చూసే రాఖీ పండుగ వచ్చేస్తోంది. తోబుట్టువుల అనుబంధానికి ప్రత్యేకంగా జరుపుకునే ఈ పండుగ కోసం అంతా ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news