తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు ఎవరు అనేది క్లారిటీ వచ్చింది. తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్. రామచందర్ రావు పేరు దాదాపు ఖరారు అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా.. తెలంగాణ బిజెపి అధ్యక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇవాళ నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగనుంది.

ఈ తరుణంలో బిజెపి తెలంగాణ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు… ఇవాళ మధ్యాహ్నం నామినేషన్ చేయాలని బిజెపి అధిష్టానం ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా బీసీ నాయకుడిని నియమిస్తారని ముందుగా ప్రచారం సాగింది. ఈటెల రాజేందర్, డీకే అరుణ, లాంటి వాళ్ల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు పేరు ఖరారు చేసినట్లు చెబుతున్నారు. దీనిపై ఇవాళ మధ్యాహ్నం లోపు క్లారిటీ రానుంది.