ఉజ్జయిని మహంకాళి అమ్మవారిలో మాతంగి స్వర్ణలత రంగం భవిష్యవాణి వినిపించారు. అమ్మవారి ఎదురుగా పచ్చి కుండపై నిలుచుని భవిష్యవాణి పలికారు స్వర్ణలత. ఈ ఏడాది పూజలు సంతోషంగా ఆనందంగా అందుకున్నాను…. ఎవరికి ఏ ఆటంకం లేకుండా చూసుకున్నాను. నన్ను కొలిచి నిండే నిలిచిన మహంకాళి నేను అని తెలిపారు. ఏ బోనం అయినా, ఎవరు ఎతుకొచ్చినా పర్వాలేదు. సంతోషంగా అందుకునేది నేనే అని పేర్కొన్నారు.
కోరినంత వర్షాలు వుంటాయి… మంచిగా చూసుకుంటానని తెలిపారు. ఎటువంటి లోటు లేదు మీకు. మీరు ఆనందంగా, సంతోషంగా ఉండండని ఆమె భరోసా ఇచ్చారు. నా దర్శనం చేసుకోవాలంటే ఆ మాత్రం కష్టపడాలి. లేదంటే సోమరి పోతులు అవుతారన్నారు. పిల్లలు, పెద్దలు, జంతువులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూసుకుంటానని భవిష్యవాణి పలికారు స్వర్ణలత.
నా రూపం పెట్టాలి అనుకుంటున్నారు కదా .. పెట్టండి. ఎవరు ఏం చేసినా, ఎవరెంత అడ్డుపడిన నా రూపం నేను పెట్టించుకుంటాను. తప్పని సరిగా నా రూపాన్ని నేను నిలబెట్టుకుంటానని పేర్కొన్నారు. నా గ్రామ ప్రజలు అందరికీ నేను సంతోషంగా ఉండటానికి సళ్ళని సాక పెడుతున్నారు… ఈ సారి కూడా 5 వారాలు పప్పు బెల్లలతో శాఖ పెట్టండని చెప్పారు. ఔషధాలు ఎక్కువ వాడుతున్నారు… అందుకే అనారోగ్యం,.. వాటిని తగ్గించుకుంటే మీకు వ్యాధులు తగ్గుతాయని చెప్పారు. సంతోషంగా ఘనంగా అందుకున్నాను. పిల్లలకు, గర్భిణులకు ఏం ఇబ్బంది రానివ్వను. అందరినీ సంతోషంగా ఆనందంగా వుండేలా చూసుకుంటానని భవిష్యవాణి పలికారు స్వర్ణలత.