జగన్ చెవిలో పెట్టిన గుస గుసపై రఘురామ క్లారిటీ…హాయ్ చెప్పాడంటూ !

-

జగన్ చెవిలో పెట్టిన గుస గుసపై ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు క్లారిటీ ఇచ్చారు. ఇవాళ అసెంబ్లీ ప్రారంభం కాగానే.. హాల్‌లో జగనుతో మాట్లాడారు ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు. అయితే.. జగన్ తో జరిగిన సంభాషణ వివరాలు మీడియాతో పంచుకున్నారు రఘురామ కృష్ణంరాజు. అసెంబ్లీ హాల్లో జగన్… నా భుజం పై 2 సార్లు చేయు వేసి మాట్లాడాడని వెల్లడించారు ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు.

Raghu Rama Krishna Raju Chit Chat With Ys jagan

కనిపించిన వెంటనే హాయ్ అని జగన్ పలుకరించారని పేర్కొన్నారు. రోజు అసెంబ్లీకి రావాలని జగన్ ను కోరానని… రెగ్యులర్ గా వస్తాను.. మీరే చూస్తారుగా అని జగన్ చెప్పారన్నారు. తనకు జగన్ ప్రక్కనే సీట్ వేయించాలని పయ్యావుల కేశవ్ ను కోరారట రఘురామ కృష్ణ రాజు. దీంతో తప్పని సరిగా అంటూ లాబీల్లో నవ్వుకుంటూ వెళ్లారట శాసనసభ వ్యవహారాల మంత్రి కేశవ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version