Telangana: ORR అప్రోచ్ రోడ్డుకు.. రతన్ టాటా పేరు పెట్టాలని ఆలోచన చేస్తోందట రేవంత్ రెడ్డి సర్కార్. ఔటర్ రింగ్ రోడ్డు అప్రోచ్ రోడ్డుకు.. రతన్ టాటా పేరు పెట్టే అవకాశాన్ని పరిశీలిస్తామని ఈ మేరకు మంత్రి శ్రీధర్ బాబు ప్రకటన చేశార. ఔటర్ రింగ్ రోడ్డు నుండి ఆదిభట్ల వరకు గల అప్రోచ్ రోడ్డుకు రతన్ టాటా మార్గ్ అని పేరు పెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆదిభట్లలో TCS కార్యాలయం ఉందన్న సంగతి తెలిసిందే.
కాగా రతన్ టాటా మృతి పట్ల సీఎం రేవంత్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈరోజు దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందన్నారు. రతన్ టాటా నిష్క్రమణ పారిశ్రామిక రంగానికే కాకుండా యావత్ దేశానికి తీరని లోటు అన్నారు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి. రతన్ టాటా వ్యాపార రంగంలో నిబద్ధతకు, విలువలకు కట్టుబడిన గొప్ప వ్యక్తిగానే కాక దాతృత్వానికి ప్రతీక అన్నారు. టాటా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయన ఎనలేని సేవలు అందించారు. విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో ఆయన సేవలు చిరస్మరణీయమని తెలిపారు.