బాసర సరస్వతి దేవి ఆలయానికి వెళ్ళే భక్తులకు బిగ్ షాక్ తగిలింది. బాసరలోని శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయంలో పూజ టిక్కెట్లను తాజాగా పెంచారు. ఒకటో తేదీ నుంచి అమలు చేయనున్నట్లు, బాసర ఆలయ ఈవో విజయ రామారావు కీలక ప్రకటన చేశారు. అమ్మవారి రుద్రాభిషేకానికి ఏకంగా 500 రూపాయలు పెంచారు.
అటు వంద రూపాయలు ఉన్న అక్షరాభ్యాసం ధరను 150 రూపాయలకు పెంచారు. ప్రత్యేక కుంకుమార్చనను 200 రూపాయలకు పెంచారు. సత్యనారాయణ స్వామి పూజ 400 రూపాయలకు అలాగే నిత్య చండీ హోమం పదిహేను వందల రూపాయలు నిర్ధారించారు. అన్నప్రాసన 150 రూపాయలు పెంచుతూ ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది.