మంత్రి పొన్నంను కలిసిన అద్దె బస్సు యాజమాన్య సంఘం

-

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్‌ని కలిశారు హైర్ బస్సు యాజమాన్య సంఘం. ఈ సందర్భంగా అద్దె బస్సుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతి పత్రం అందజేశారు ఆర్టీసీ అద్దె బస్సుల సంఘం సభ్యులు. కాగా, రేపట్నుంచి బస్సులు బంద్ కానున్నాయి.

Rent Bus Owners Association met Minister Ponnam

టీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు రేపటి నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. మహాలక్ష్మి పథకంతో ప్రయాణికుల సంఖ్య పెరిగిందని…. రద్దీ పెరిగితే బస్సులు పాడవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రద్దీ వల్ల ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

దీంతో టీఎస్ఆర్టీసీ యాజమాన్యం వారిని ఇవాళ చర్చలకు ఆహ్వానించింది. చర్చలు సానుకూలంగా లేకపోతే సమ్మె యధావిధిగా చేస్తామని యజమానులు హెచ్చరించారు. మరి టీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు సమ్మెపై ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించలేదు. మరి టీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు సమ్మెపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news