దిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

-

ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీలో పర్యటించనున్నారు. ఇందుకోసం ఆయన ఇవాళ ఉదయం అధికారులతో కలిసి హస్తినకు వెళ్లారు. దేశ రాజధానిలో జరగనున్న ఏఐసీసీ సమావేశంలో పాల్గొననున్నారు. సీఎం వెంట సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, ఆర్థిక శాఖ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు దిల్లీ వెళ్లారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో వీరంతా అక్కడికి బయల్దేరారు. ఏఐసీసీ భేటీ అనంతరం రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల గురించి హైకమాండ్తో చర్చించనున్నట్లు సమాచారం.

మరోవైపు బుధవారం రోజున ఇందిరాభవన్‌లో జరిగిన పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, చర్చించిన అంశాలను రేవంత్ ఏఐసీసీకి వివరించనున్నారు. ఈ సమావేశంలో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరుతూ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పీసీసీ) తీర్మానించింది. ఇందులో రేవంత్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని పీసీసీ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ విషయాన్ని సోనియాకు తెలిపి లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి పోటీ చేయాలని రేవంత్ రెడ్డి కోరనున్నట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news