రేణుక చౌదరికి ఊహించని పరిణామం చోటు చేసుకుంది. రేణుక చౌదరి ముఖ్య అనుచరుడుకి కత్తి పొట్లు పడ్డాయి. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కొంజర్ల గ్రామ సర్పంచ్, రేణుక చౌదరి ముఖ్య అనుచరుడు సూరంపల్లి రామారావుని కత్తితో పొడిచారు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు.
ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో ఖమ్మం తరలించగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం రేణుక చౌదరి ముఖ్య అనుచరుడు సూరంపల్లి రామారావు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.