కామారెడ్డి ఘటనపై స్పందించిన ప్రధాని..మృతుల కుటుంబాలకు 2 లక్షల పరిహారం

-

కామారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం పై ప్రధాని మోదీ స్పందించారు. డ్రైవర్ అతివేగం కారణంగా తొమ్మిది మంది నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ దుర్ఘటన ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని హసన్ పల్లి గేట్ వద్ద ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. 25 మంది ప్రయాణీకులతో వస్తున్న టాటా ఏస్ వాహనం.. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే ముగ్గురు మరణించగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా మరో నలుగురు తనువు చాలించారు. చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించారు.

ప్రమాద సమయంలో వాహనం లో 25 మంది ప్రయాణిస్తుండగా వారిలో మొత్తం 9 మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరో 14 మందికి కూడా గాయాలు కావడంతో వారికి కూడా చికిత్స అందుతోంది. ఈ ఘటనపై ప్రధాని మోడీ స్పందిస్తూ..” తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మరణించిన వారి కుటుంబ సభ్యులకు 2 లక్షలు, రూ. క్షతగాత్రులకు రూ.50,000 చొప్పున పిఎమ్ఎన్ ఆర్ నుండి అందజేయబడుతుంది అని పీఎంవో ట్విటర్ ఖాతా నుండి ప్రకటన వెలువడింది.

Read more RELATED
Recommended to you

Latest news