9 నెలల్లోనే రూ.75,995 కోట్లు అప్పు చేసిన రేవంత్ సర్కార్!

-

రేవంత్ సర్కార్..తెలంగాణలో భారీగానే అప్పులు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. రేవంత్ సర్కార్ ఏర్పాటు అయిన 9 నెలల్లోనే రూ.75,995 కోట్లు అప్పు చేసినట్లు నివేదికలు వస్తున్నాయి. ఇక తాజాగా మరో రూ.1500 కోట్లు అప్పు చేసేందుకు నిర్ణయం తీసుకుందట రేవంత్ సర్కార్.

Revant Sarkar who borrowed Rs. 75,995 crores in 9 months

ఇందులో భాగంగానే… ఇవాళ బాండ్ల వేలం ద్వారా ఆర్బీఐ నుండి రూ.1500 కోట్లు అప్పుల రూపంలో తీసుకోనుందని వార్తలు వస్తున్నాయి. ఈ లెక్కలు పరిశీలించినట్లు అయితే.. రేవంత్ సర్కార్ ఏర్పాటు అయిన 9 నెలల్లోనే రూ.75,995 కోట్లు అప్పు చేసినట్లు సమాచారం.

ఇక అటు ప్రజా భవన్ లో నిర్వహిస్తున్న 16వ ఫైనాన్స్ కమిషన్ సమావేశంలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మల్లు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి సహాయం అందించండని కేంద్రాన్ని కోరుతున్నారు. పన్నుల నుంచి మాకు వచ్చే ఆదాయం వాటాను 41% నుంచి 50% పెంచండని వివరించారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ రాష్ట్రానికి జీవరేఖ లాంటివి.. ఈ రాష్ట్ర ప్రజలకు ఆర్థిక భరోసాలు, అధిక భద్రతను కల్పిస్తాయని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news