బీజేపీ అంటే..బ్రిటిష్ జనతా పార్టీ – రేవంత్‌ రెడ్డి

-

బీజేపీ అంటే..బ్రిటిష్ జనతా పార్టీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్‌ రెడ్డి. లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు ప్రాణ త్యాగం చేసి స్వాతంత్య్రాన్ని సాధించుకున్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.

గాంధీ భవన్ లో పంద్రాగస్టు వేడుకలు జరుగగా.. ఈ సందర్భంగా జాతీయ జెండా ఎగరేశారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ… దేశానికి ఆత్మలాంటిది కాంగ్రెస్ అని… దేశ సమగ్రత కాపాడిన పార్టీ కాంగ్రెస్ అంటూ కామెంట్స్‌ చేశారు.

ఎస్సీ వర్గీకరణ ఎవరి పేటెంట్ కాదని..మా కమిట్ మెంట్ కి ఎవరి సర్టిఫికేట్ అవసరం లేదన్నారు. Sc లకు క్లారిటీ ఉంది..కాంగ్రెస్ ఏంటి అనేదని… వర్గీకరణ పట్ల కాంగ్రెస్ చిత్తశుద్ధి ని శంకించాల్సిన పనిలేదని పేర్కొన్నారు. రిజర్వేషన్లు ఇచ్చింది మేము…ఎవరైనా నాయకులు.. మద్దతు ఇచ్జిన పార్టీని అడిగితే మంచిదని వెల్లడించారు.మద్దతు ఒకరికి ఇచ్చి.. డిమాండ్ ఇంకొకరి ని అడగడం కాదని ఆగ్రహించారు. ఆ సామాజిక వర్గం ప్రజలు కూడా ఆలోచన చేయాలని కోరారు రేవంత్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news