సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టిందే కాంగ్రెస్‌ పార్టీ : రేవంత్ రెడ్డి

-

సంక్షేమ కార్యక్రమాలు మొదలు పెట్టిందే కాంగ్రెస్‌ పార్టీ అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. పింఛన్లు, పక్కా ఇళ్లు, నిరుపేదలకు భూమి ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్‌ పార్టీ ప్రాధాన్యం ఇస్తోందని వెల్లడించారు. మైనార్టీలను ఓట్లు వేసే యంత్రాలుగా తమ పార్టీ చూడదని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో మైనార్టీలను భాగస్వాములుగా మారుస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో మైనార్టీలకు గుర్తింపు, గౌరవం ఉంటుందని పేర్కొన్నారు.

“మా ప్రభుత్వం వచ్చాక విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాం. 2014 నాటి మా ఎన్నికల మ్యానిఫెస్టోనే కేసీఆర్ అమలు చేస్తున్నారు. ప్రతి రైతు ఖాతాలో రూ.10 వేలు వేస్తామని 2014లో మేం హామీ ఇచ్చాం. దళారుల చేతుల్లో రైతులు మోసపోకూడదనే కనీస మద్దతు ధర ప్రకటించాం. సహేతుకమైన సూచనలను ఎప్పుడూ తీసుకుంటాం.. పరిశీలిస్తాం. హైదరాబాద్‌ అభివృద్ధికి మూలం.. కాంగ్రెస్‌ విధానాలే. మూసీ నదిని ప్రక్షాళన చేస్తాం.. ఇరువైపులా వ్యాపార కేంద్రాలు నిర్మిస్తాం.” అని రేవంత్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news