కేసీఆర్‌ ఇచ్చే రూ.10 వేలకు ఆశపడి ఓటు వేయొద్దు: రేవంత్‌

-

కామారెడ్డిలో కేసీఆర్‌ ఇచ్చే రూ.10 వేలకు ఆశపడి ఓటు వేయొద్దని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓటర్లను కోరారు. కేసీఆర్‌ను గెలిపిస్తే.. కామారెడ్డిలో వేల కోట్లు విలువైన భూములను కబ్జా చేస్తారని ఆరోపించారు. రెండుపడక గదుల ఇళ్లు ఇవ్వని కేసీఆర్‌కు ఓటు ఎందుకు వేయాలని నిలదీశారు. ఐదేళ్లుగా రుణ మాఫీ పూర్తి చేయని కేసీఆర్‌ను ఎందుకు గెలిపించాలని ప్రశ్నించారు. తెలంగాణ దశ దిశను మార్చే తీర్పును కామారెడ్డి ప్రజలు ఇవ్వాలి అని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

“కామారెడ్డి ప్రజల తీర్పును దేశం నిశితంగా గమనిస్తోంది. పదేళ్లలో ప్రజలకు కేసీఆర్ చేసిందేం లేదు. వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయకుండా వైశ్యులను కేసీఆర్ మోసం చేశారు. వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. గల్ఫ్ కార్మికులకు ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తాం. కార్మికులు ప్రమాదవశాత్తు చనిపోతే వారి కుటుంబానికి 10లక్షలు, పిల్లల చదువుకు సాయపడేలా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. బీడీ కార్మికులను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం.” అని రేవంత్ హామీ ఇచ్చారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ్టితో గడువు ముగియనున్నందున రేవంత్ ప్రచారంలో స్పీడ్​ను పెంచారు. ఇందులో భాగంగా కామారెడ్డిలో పర్యటించారు. అనంతరం దోమకొండ, బీబీపేట్​లో రోడ్ షో నిర్వహించనున్నారు. అక్కడి నుంచి మల్కాజిగిరి చేరుకుని ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news