24 గంటల ఉచిత విద్యుత్ పై రేవంత్ సవాల్‌..నామినేషన్లు వెనక్కి తీసుకుంటా !

-

ఉచిత విద్యుత్ పై కామారెడ్డి చౌరస్తాలో చర్చకు సిద్ధం అన్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. తెలంగాణ సీఎం కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. 24 గంటల ఉచిత విద్యుత్ పై కామారెడ్డి చౌరస్తాలో చర్చకు సిద్ధమని ఛాలెంజ్‌ విసిరారు.

24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే అటు కొడంగల్ లో, ఇటు కామారెడ్డిలో నేను నామినేషన్ ఉపసంహరించుకుంటానని స్పష్టం చేశారు. సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ ఉపసంహరణకు టైం ఉంది..లాగ్ బుక్ లు తీసుకుని కామారెడ్డికి రా కేసీఆర్ అంటూ ఛాలెంజ్‌ చేశారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి.

కామారెడ్డి నుంచి ఎందుకు పోటీ చేస్తున్నావ్? అని తనను అందరూ అడుగుతున్నారని, అయితే మీకు అండగా ఉండేందుకే ఇక్కడకు వచ్చానన్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత ఆశపడిందని, కానీ వారి ఆశలపై కేసీఆర్ నీళ్లు చల్లారన్నారు. ఉద్యోగాలు రాక యువత ఆత్మహత్యలు చేసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news