బీఆర్ఎస్​ నేతల వద్ద డబ్బులు ఉంటే.. కాంగ్రెస్‌ అభ్యర్థుల వద్ద ఓట్లున్నాయి : రేవంత్ రెడ్డి

-

డబ్బును చూసి కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతల వద్ద డబ్బులు ఉంటే… కాంగ్రెస్‌ అభ్యర్థుల వద్ద ఓట్లు ఉన్నాయని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీలు డబ్బును చూసి అభ్యర్థులను ఎంపిక చేశాయని ఆరోపించారు. ఆదిలాబాద్‌ను సస్యశ్యామలం చేసేందుకు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ప్రతిపాదించామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కడెం ప్రాజెక్టు నిర్వహణ చేయలేకపోతుందని మండిపడ్డారు. ఖానాపూర్​లో నిర్వహించిన విజయభేరి సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

“కాంగ్రెస్‌ దళితులకు, పేదలకు భూములు ఇచ్చింది. ధరణి తెచ్చి పేదల భూములను బీఆర్ఎస్ గుంజుకుంది. రైతులను బీఆర్ఎస్ ప్రభుత్వం నిండా ముంచింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాను అభివృద్ధి చేస్తాం. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు ప్రత్యేక నిధులు కేటాయిస్తాం. ధరణి లేకపోతే రైతుబంధు రాదని కేసీఆర్‌ చెబుతున్నారు. రైతుబంధు వచ్చింది 2018లో…ధరణి 2020లో వచ్చింది. 2018 నుంచి 2020 వరకు ధరణి లేకుండానే రైతుబంధు ఎలా వచ్చింది? బీఆర్ఎస్ నేతలు ధరణి తెచ్చి దందాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే ధరణికంటే మెరుగైన పోర్టల్‌ తీసుకొస్తాం.” అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news