రాష్ట్ర చిహ్నంలోనే రాచరిక పోకడల గుర్తులు కనిపిస్తున్నాయి : రేవంత్ రెడ్డి

-

తెలంగాణ రాష్ట్ర చిహ్నంలోనే రాచరిక పోకడల గుర్తులు కనిపిస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర చిహ్నంలో ప్రజల త్యాగాల గుర్తులు ఉండాలని చెప్పారు. రాష్ట్ర అధికారిక చిహ్నంలో పోరాటాల స్ఫూర్తి కనిపించడం లేదని తెలిపారు. తెలంగాణ కోసం ఎందరో యువకులు ప్రాణత్యాగం చేశారన్న రేవంత్ రెడ్డి.. ఈ పదేళ్లలో కేసీఆర్ ఏం చెప్పారు.. ఏం జరిగిందో ప్రజలు ఆలోచించాలని కోరారు. పేదల సంక్షేమం కోసం నిధులు ఉపయోగపడ్డాయో లేదో ప్రజలు ఆలోచించాలని సూచించారు.

‘దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక స్థానం ఉంది. సమైక్య పాలనలో సీమాంధ్ర నేతలే పెత్తనం చెలాయించారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ఇబ్బంది పెట్టారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, అభివృద్ధిని.. రాష్ట్ర ప్రజలు కోరుకున్నారు. తెలంగాణ.. ఒక్క వ్యక్తి ఉక్కు పాదాల కింద నలిగిపోతోంది. ఈ ప్రాంత ప్రజల పోరాటంలో న్యాయం, ధర్మం ఉన్నదని కాంగ్రెస్ నమ్మింది. ధర్మం వైపు నిలబడటం వల్లే సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారు. ఎన్ని రాజకీయ ఇబ్బందులు ఎదురైనా సోనియా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారు.’ అని రేవంత్ రెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news