రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక ఎకరానికి రూ.17,500 చొప్పున రైతుబంధు బాకీ పడింది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తాజాగా ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఒక్కో రైతుకు, ఎన్ని ఎకరాలకు ఎంత బాకీ ఉందో ఈ పోస్టర్లు ఊరూరా వేస్తామని తెలిపారు. ప్రభుత్వం దగ్గర రైతుల పూర్తి వివరాలు ఉన్నప్పుడు మళ్లీ ప్రమాణ పత్రాలు ఎందుకు అని ప్రశ్నించారు కేటీఆర్. సబ్ కమిటీ ఐదేండ్ల తరువాత నివేదిక ఇస్తదేమో అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి రైతుబంధు ఇచ్చింది.. అది కూడా అందరికీ ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. కౌలు రైతులకు ఎప్పటి నుంచి రైతు భరోసా ఇస్తారని ప్రశ్నిస్తున్నాం. రైతును రాజు చేయాలన్నది మా ప్రయత్నం.. రైతును బిచ్చగాణ్ణి చేయాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ హయాంలో రైతులకు ఇచ్చిన రూ.80వేల కోట్ల వివరాలను బయటపెట్టు అన్నారు. ఫామాయిల్, మామిడి, బత్తాయి, నిమ్మ తోటలను ఒకే పంటగా కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తిస్తోందన్నారు.