కామారెడ్డిలో రేవంత్ రెడ్డి ఆధిక్యం

-

తెలంగాణ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే బ్యాలెట్, సర్వీస్ ఓట్ల లెక్కింపు ముగింపు దశకు వచ్చింది. ఈ ఓట్లలో దాదాపు చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కనిపిస్తోంది. హస్తం అభ్యర్థులు మెజార్టీతో ముందంజలో కొనసాగుతున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. రెండో స్థానంలో సీఎం కేసీఆర్ కొనసాగుతున్నారు. అయితే ఈ నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే.

కామారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. గజ్వేల్​తో పాటు కామారెడ్డిలోనూ ఆయన బరిలోకి దిగారు. అయితే కేసీఆర్​ను ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఆయనకు వ్యతిరేకంగా తమ పార్టీ నుంచి రేవంత్ రెడ్డిని బరిలోకి దింపింది. ఇక రేవంత్ కొడంగల్​తో పాటు కామారెడ్డిలో కేసీఆర్​కు గట్టి పోటీనిచ్చారు. వరుస సభలు, సమావేశాలు, రోడ్ షోలు నిర్వహిస్తూ భారీగా ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ హయాంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారనే విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇక ఇప్పుడు కామారెడ్డి నియోజకవర్గం ఓట్ల లెక్కింపులో కేసీఆర్​ను దాటేసి ముందంజలో కొనసాగుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news