కొడంగల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి హవా

-

తెలంగాణ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు జరిగిన లెక్కింపులో టీపీసీసీ చీఫ్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి కామారెడ్డి, కొడంగల్ నియోజకవర్గాల్లో ముందంజలో ఉన్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి ఆధిక్యం కొనసాగుతోంది. కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌పై.. కొడంగల్‌లో పట్నం నరేందర్ రెడ్డిపై రేవంత్ ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు కొడంగల్‌ నియోజకవర్గంలో 6 రౌండ్లు పూర్తయ్యేసరికి రేవంత్‌ రెడ్డికి 6416 ఓట్ల ఆధిక్యత సాధించారు. కామారెడ్డిలో 5 రౌండ్ల తర్వాత కూడా రేవంత్ ముందంజలో ఉన్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రేవంత్ ఘోర ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఇక ఈ ఎన్నికల్లో తన గెలుపుతో పాటు పార్టీ విజయంపై దృష్టి పెట్టిన రేవంత్ ఆ దిశగా సఫలీకృతం అయినట్టే కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు వెలువడుతున్న ఫలితాల్లో చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో నిలవడం ఎగ్జిట్ ఫలితాలు నిజం కాబోతున్నాయన్నదానికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news