BRS కు షాక్… వెనుకంజలో 6 గురు మంత్రులు !

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో మంత్రులు వెనుకపడ్డారు. తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, పువ్వాడ అజయ్‌, నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి వెనుకపడ్డారు. ఇక అటు రెండు చోట్ల వెనుకంజలో ఈటల రాజేందర్ ఉన్నారు. అటు మంత్రి శ్రీనివాస్ గౌడ్..మళ్లీ లీడ్ సాధించారు.

కొత్తగూడెంలో సీపీఐకి భారీ మెజారిటీ వస్తోంది. ఖమ్మలో 8386 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల ఉన్నారు. కొడంగల్ లో 12 వేలకు పైగా ఆధిక్యంలో రేవంత్ రెడ్డి ఉన్నారు. షాద్ నగర్ లో 1815 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ ఉంది. అంబర్ పేట్ లో బీఆర్ఎస్ కు ఆధిక్యం ఉంది. కల్వకుర్తిలో 6 వేల ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ ఉంది. పాలేరులో 12 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ ఉంది. అశ్వరావుపేటలో భారీ లీడ్ తో కాంగ్రెస్ దూసుకుపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news