నూతన సంవత్సరం సందర్భంగా ప్రముఖులు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. మరోవైపు తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ తమిళిసైని మర్యాద పూర్వకంగా కలిశారు. రాజ్భవన్ వెళ్లిన రేవంత్ గవర్నర్ దంపతులకు కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలిపారు. సీఎంతో పాటు స్పీకర్, మంత్రి కొండా సురేఖ, సీతక్కలు రాజ్భవన్కు వెళ్లారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి సైతం పలువురు ఐఏఎస్లు, ప్రభుత్వ ఉద్యోగులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
మరోవైపు అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. సమాచార శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి రేవంత్ రెడ్డికి పూల మొక్కను అందించి న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని ఎక్సైజ్ శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క రేవంత్ రెడ్డితో పాటు సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రికి ఇందిరాగాంధీ చిత్రపటాన్ని బహుకరించారు.