రైతుబంధు పేరిట ప్రభుత్వ నిధులతో బీఆర్ఎస్ ఓట్లు కొనుగోలు చేస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ‘ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 15లోపే రైతుబంధు ఇవ్వాలని మేము చెప్పాం. కానీ కావాలనే ఓటు వేసే ముందే డబ్బులు వేస్తున్నారు.
దీనికి బీజెపీ సహకారం కూడా ఉంది. రైతుబంధు ఇస్తున్న కేసీఆర్…. దళిత బంధు, బీసీబంధు, మైనార్టీబంధు ఎందుకు ఇవ్వట్లేదు?’ అని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కాగా, ఇవాళ ఆరు నియోజకవర్గాల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేయనున్నారు. నారాయణపేట్, దేవరకద్ర, మహబూబ్ నగర్, కామారెడ్డి, పఠాన్ చెరు, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో ప్రచార సభలలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 10గంటలకు నారాయణపేట్ బహిరంగ సభలో పాల్గొంటారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఉదయం 11 గంటలకు దేవరకద్ర బహిరంగసభ లో .. మధ్యాహ్నం 12 గంటలకు మహబూబ్ నగర్ జనసభలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొంటారు.