డిసెంబర్ 3 న ప్రజల తెలంగాణ ఆవిష్కృతం : రేవంత్ రెడ్డి

-

డిసెంబరు 3వ తేదీన ప్రజల తెలంగాణ ఆవిష్కృతమవుతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆరోజున రాష్ట్రానికి పట్టిన పీడ విరగడవుతుందని పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండటంపై హర్షం వ్యక్తం చేశారు. ఇదంతా కార్యకర్తల వల్లే సాధ్యమైందని చెప్పారు. తమ పార్టీ కోసం కష్టపడిన వారందరికి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ చైతన్యవంతమైందని కామారెడ్డి ప్రజలు నిరూపించారని రేవంత్ వెల్లడించారు.

“డిసెంబరు 3న దొరలు తెలంగాణ అంతమై.. ప్రజల తెలంగాణ ఆవిష్కృతమవుతుంది. తెలంగాణ ప్రజల చైతన్యం మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. బీఆర్‌ఎస్‌ పార్టీకి 25 కంటే ఒక్క సీటు కూడా దాటదు. సునామీ వస్తే గడ్డపారలే కొట్టుకుపోతాయి.. గడ్డిపోచ ఓ లెక్కా. గతంలో పోలింగ్‌ ముగియగానే కేసీఆర్‌ వచ్చేవారు.. కానీ ఓటమి ఖాయమని తెలిసే కేసీఆర్‌ ముఖం చాటేశారు. కేటీఆర్‌ కూడా త్వరలోనే అమెరికాకు వెళ్లిపోతారు. అధిష్ఠానం సూచన ప్రకారం సీఎల్పీ సమావేశం నిర్వహిస్తాం. సీఎల్పీలో చర్చించి ప్రభుత్వ ఏర్పాటు తేదీని నిర్ణయిస్తాం. ప్రొఫెసర్‌ కోదండరామ్‌కు కీలక బాధ్యతలు అప్పగిస్తాం. మెజార్టీల పట్ల ఉన్న విధానమే మైనార్టీల పట్లు ఉంటుంది.” అని రేవంత్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news