తెలంగాణలో కేసీఆర్ నియంత పాలనను అంతం చేయాలని కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రజలు కూడా భావిస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నిరంకుశ పాలనకు ఈ ఎన్నికల్లో ప్రజలు చరమగీతం పాడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం రోజున పాలకుర్తి నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పర్యటించారు. అక్కడ నిర్వహించిన విజయభేరి సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్ పార్టీపై, కేసీఆర్ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
మరోవైపు ఇవాళ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా పాలకుర్తి పర్యటన గురించి రేవంత్ ట్వీట్ చేశారు. “ఉప్పెన చిన్నబోయింది… ఈ జనగర్జన ముందు… నో డౌట్… పాలకుర్తే కాదు… తెలంగాణ మొత్తం ఒక్క గొంతుకై నినదిస్తోంది… దొరల తెలంగాణ వద్దు … ప్రజల తెలంగాణ కావాలని.” అని రేవంత్ రెడ్డి తన ట్వీట్లో పేర్కొన్నారు. తెలంగాణలో దొరల పాలన అంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను రేవంత్ రెడ్డి కోరారు.
ఉప్పెన చిన్నబోయింది…
ఈ జనగర్జన ముందు…నో డౌట్… పాలకుర్తే కాదు…
తెలంగాణ మొత్తం ఒక్క గొంతుకై నినదిస్తోంది…
దొరల తెలంగాణ వద్దు … ప్రజల తెలంగాణ కావాలని.#MaarpuKavaliCongressRavali#CongressVijayabheriYatra #CongressWinningTelangana#Congress6Guarantees #Palakurthi pic.twitter.com/QwB5yZNbd8— Revanth Reddy (@revanth_anumula) November 10, 2023