టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. చీలమండ గాయంతో బాధపడుతున్న హార్దిక్ పాండ్యా కోలుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ గాయంతో వరల్డ్ కప్ కు దూరమైన అతడు AUSతో జరిగే ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ కు కూడా అందుబాటులో ఉండరని సమాచారం.
పాండ్యా గైర్హాజరితో సూర్యకుమార్ లేదా రుతురాజ్ లో ఒకరికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉంది. వచ్చే నెల 10 నుంచి సౌత్ ఆఫ్రికాతో జరిగే టి20 సిరీస్ కు హార్దిక్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
కాగా… నిన్న జరిగిన శ్రీలంక మరియు న్యూజిలాండ్ మ్యాచ్ లో విలియమ్సన్ సేన అయిదు వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. ముందుగా టాస్ గెలిచి ఛేజింగ్ ఎంచుకున్న కివీస్ ముందు శ్రీలంక పేలవంగా ఆడి కేవలం 172 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిగింది.
ఈ లక్ష్యాన్ని న్యూజిలాండ్ అయిదు వికెట్లు కోల్పోయి 23 .2 ఓవర్లలో ఛేదించి గెలిచింది. ఈ విజయంతో న్యూజిలాండ్ తొమ్మిది మ్యాచ్ లలో అయిదు గెలిచి పాయింట్ 10 లతో పాయింట్ల పట్టికలో నాలుగవ స్థానంలో నిలిచింది, ఇక రన్ రేట్ లోనూ + 0.922 కు చేరుకుంది. దీనిని బట్టి సెమిఫైనల్ 1 లో ఇండియా తో తలపడే జట్టు న్యూజిలాండ్ అని అంతా ఫిక్స్ అయిపోతున్నారు.