“బ్రతకడానికి వచ్చినోళ్ళు” అంటూ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించడం పై కేసీఆర్ కుటుంబం క్షమాపణలు చెప్పాలని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. పార్టీ ఫిరాయింపు లపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ఫిరాయింపులపై ఏ ఆదేశాలు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వ స్థిరత్వానికి అది మంచిదేనన్నారు. మా ప్రభుత్వాన్ని కూల్చుతామంటేనే ఈ ఫిరాయింపులు మొదలయ్యాయని… పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) ప్రతిపక్షానికే ఇచ్చామని తెలిపారు.
అసెంబ్లీ చివరిరోజు “బిఅర్ఎస్” సభ్యుల సంఖ్యను ప్రకటించినప్పుడు, ఆ పార్టీ ఎందుకు అభ్యంతరం చెప్పలేదని… 2019 నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ “పిఏసి” చైర్మన్ గా ఎలా ఉంటారు? కాంగ్రెస్ ప్రతి పక్షంగా ఉంటే ఎంఐఎం కు ఎలా ఇచ్చారు…ఇస్తారు…!? అని వివరించారు. బ్రతక డానికి వచ్చినోళ్ళ ఓట్లు కావాలి కానీ, వాళ్లకు టికెట్లు ఇవ్వద్దా..! ? కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల పై కేసీఆర్ కుటుంబం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.