రేవంత్.. నాలుగు వేల పెన్షన్ ఎప్పుడిస్తావ్ : కిషన్ రెడ్డి

-

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.2వేల పెన్షన్ ను రూ.4వేలు చేస్తామని హామీ ఇచ్చిందని.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక ఇవ్వాల్సిన రూ.2వేల పెన్షన్ కూడా సరిగ్గా ఇవ్వడం లేదని మండిపడ్డారు. రూ.4వేల పెన్షన్, ఆటో డ్రైవర్లకు రూ.12వేలు ఎప్పుడిస్తావని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. కాంగ్రెస్ గ్యారెంటీల గారడీ.. 6 అబద్దాలు, 66 మోసాల పేరుతో బీజేపీ ఛార్జ్ షీట్ విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ అమలు కానీ హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది.

ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని ఈ ఏడాదిలో నెరవేర్చలేదు. 100 రోజుల్లో నెరవేరుస్తామనే హామీలు.. ఏడాది గడిచినా పూర్తి చేయలేదు అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించని ఈ ప్రభుత్వం విజయోత్సవాలు చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలను చూసి ప్రజలు నివ్వెర్రపోతున్నారని పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్ 09న అందరికీ రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఏడాది గడిచినా రుణమాఫీ అందరికీ పూర్తి కాలేదన్నారు. బీఆర్ఎస్-కాంగ్రెస్ పాలన కు ఏ మాత్రం తేడా లేదని కిషన్ రెడ్డి విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news