ఎవ్వరూ ఏమనుకున్నా తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని బీఆర్ఎస్ కేటీఆర్ పేర్కొన్నారు. రేవంత్ తెలంగాణ బూతుపిత అవుతారని ఎద్దేవా చేశారు. తుపాకుల గురించి రేవంత్ రెడ్డికి తెలిసినంత తమకు తెలియదన్నారు. ఉద్యమకారులపై గన్ను ఎక్కుపెట్టిన చరిత్ర ఆయనదని దుయ్యబట్టారు. ప్రజా పాలన విఫల పాలన అని ఏ ఒక్క హామీని అమలు చేయలేదని మండిపడ్డారు. అప్పులు, అబద్దాలు, బూతులు, అన్నదాతల ఆత్మహత్యల్లో తెలంగాణ రైజింగ్ అని విమర్శలు చేశారు.
ఎవరేమన్నా తెలంగాణ జాతిపిత కేసీఆర్ అన్నారు. మరోవైపు తెలంగాణలో గురుకులాల భవనాలకు అద్దెలు చెల్లించకపోవడంతో తాళాలు వేస్తున్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఉంటే మేము కూడా చెల్లించామని తెలిపారు. ఈ ప్రభుత్వం కూడా ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కొత్తగా ఈ ప్రభుత్వం ఇచ్చింది కేవలం 11వేల ఉద్యోగాలు మాత్రమేనని.. మేము పరీక్సలు నిర్వహించిన వాటికి వీళ్లు నియామక పత్రాలు ఇచ్చారని తెలిపారు. కోటి మంది మహిళలకు రూ.2500 చొప్పున ఇస్తామన్నారు.. ఇవ్వలేదని గుర్తు చేశారు.