అసెంబ్లీ వేదికగా కేసీఆర్ కు రేవంత్ జన్మదిన శుభాకాంక్షలు

-

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్. అసెంబ్లీ వేదికగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్. 40 ఏళ్లు రాష్ట్ర, కేంద్ర రాజకీయాల్లో తన పాత్ర పోషించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ వ్యాఖ్యానించారు సీఎం రేవంత్‌.

revanth wishes kcr

తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతిపక్ష నాయకుడి పాత్రను సమర్ధవంతంగా పోషించాలని, భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నానని తెలిపారు. అటు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు గవర్నర్. BRS పార్టీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి KCR జన్మదినం సందర్భంగా గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ కార్యాలయం నుండి వచ్చి న ప్రతినిధి తెలంగాణ భ వన్ లో మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు పుష్పగుచ్ఛం, శుభాకాంక్షల లేఖను అందజేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version