థాక్రే-కేసీఆర్ సమావేశంపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్..యూపీఏను బలహీన పర్చి…ఎన్డీఏను పెంచే పనిలో ఉన్నారని.. మోడీ దగ్గర కెసిఆర్ సుపారీ తీసుకున్నాడని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ కు అనుబంధంగా ఉండే పార్టీలతో కలిసి యూపీఏను బలహీన పర్చె పని చేస్తున్నారని మండిపడ్డారు.
దేవగౌడ నాకు సహకరిస్తున్నారని కెసిఆర్ చెప్పాడని.. కానీ కెసిఆర్ తో వ్యక్తిగత పనుల మీద మాట్లాడిన అని చెప్పారని గుర్తు చేశారు. తెలంగాణ, మహారాష్ట్ర అభివృద్ది చర్చ చేశామని శరద్ పవార్ ట్వీట్ చేశారని.. మహారాష్ట్ర సీఎంవో… రెండు రాష్ట్రాల మద్య జల వివాదం…పరిశ్రమ వివాదం పై చర్చించాను అని ట్వీట్ చేశారని కేసీఆర్ కు చురకలు అంటించారు. సుప్రియ సులే కూడా అభివృద్ధి పైనే చర్చ చేశామని ట్వీట్ చేశారని.. కేసీఆర్ కూటమి గురించి ఎక్కడ మాట్లాడలేదని వాళ్ళు పోస్ట్ చేశారని చురకలు అంటించారు. భూగర్భ గనులను కెసిఆర్ కుటుంబం దోచుకుంటున్నా.. కేంద్రం ఎందుకు నివేదిక అడగలేదని ప్రశ్నించారు.