తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ల మధ్య నిలిచిపోయిన రాకపోకలు

-

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన ములుగు జిల్లాలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి వెళ్లే జాతీయ రహదారి 163 పైకి వరద నీరు చేరింది. వాజేడు మండలంలోని పావురాల వాగు బ్రిడ్జిపై నుండి వరద నీరు ప్రహిస్తుంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ రహదారి గుండా రాకపోకలను నిలిపివేశారు. వరద ఉధృతి తగ్గగానే రాకపోకలను పునరుద్ధరించనున్నారు.

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలకు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా అతాలాకుతలం అయింది. శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో నీటిని దిగువకు వదిలారు. ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఎగువ, మధ్య, దిగువ మానేరు ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. మంత్రి గంగుల కమలాకర్ దిగువ మానేరు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు.

Read more RELATED
Recommended to you

Latest news