రేప్‌ లు చేసిన మగాళ్లను చంపేయండి : తమ్మనేని సంచలనం

-

శ్రీకాకుళం : ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం దిశ యాప్ అవగాహన సదస్సులో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమాజంతో పాటు పురుషుల ఆలోచనా ధోరణి మారాలని… న్యాయానికి అన్యాయానికి జరిగినప్పుడు అవుట్ ఆఫ్ లా ఒక్కటే మార్గమని తెలిపారు. బయటికొచ్చి న్యాయం చేయాలని… తెలంగాణలో మృగాళ్లను సజ్జనార్ వేటాడిన విధానం అద్భుతమన్నారు.

మగాడు సమాజానికి రక్షణ కల్పించాలి కానీ…మృగంలా మారకూడదని తెలిపారు. మృగాల్లా వ్యవహరించేవాళ్లను క్షమించకూడదని… స్త్రీని అగౌరపరచి…రేప్‌లు చేసిన వాడిని ఈ భూమి మీద లేకుండా చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. అవుటాఫ్ ది లా అమలు చేస్తేనే సమాజంలో సమాంతర న్యాయం సాధ్యమవుతుందన్నారు. అన్నదమ్ములు, కన్న తండ్రి సైతం ఆడపిల్లల పై అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారని ఫైర్‌ అయ్యారు. అసలు సమాజం ఎటు వైపు వెళ్తోంది… రాముడు వెలసిన పుణ్యభూమి, కృష్ణుడు పుట్టిన ఖర్మభూమి మనదని పేర్కొన్నారు. ఏమైంది మన గొప్ప సంస్కృతికి… మనం ఎలా ఉండాలో చిన్నప్పటి నుంచీ సుమతీ శతకంలో చెప్పారని తెలిపారు. దిశయాప్ ను ఉపయోగించుకుంటూనే సమాజంలో మానసికమైన మార్పును తీసుకురావాలని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news