ఆరోజు ముస్లిం స్నేహితుల ఇంట్లోనే భోజనం చేసేవాళ్లం : మోదీ

-

తాను ఓటు బ్యాంకు రాజకీయాలు చేయనని, సబ్‌కా సాథ్‌-సబ్‌కా వికాస్‌ను బలంగా నమ్ముతానని ప్రధాని మోదీ అన్నారు. తన మాటలపై జరిగిన దుష్ప్రచారం చూసి షాక్‌ అయ్యానని తెలిపారు. ఎక్కువమంది పిల్లలు గురించి మాట్లాడినప్పుడు అది ముస్లింల గురించి అని ఎవరు చెప్పారు..? పేద కుటుంబాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని మోదీ పేర్కొన్నారు.

కొన్ని కుటుంబాల్లో వారి సామాజిక పరిస్థితితో సంబంధం లేకుండా అధిక సంతానం ఉందన్న ఆయన.. అది ఏ వర్గం అని తాను ప్రస్తావించలేదని స్ప,్టం చేశారు. చూసుకోగలిగినంతమంది సంతానాన్నే కనాలి కానీ..వారిని ప్రభుత్వం చూసుకునే పరిస్థితి ఉండకూడదని మాత్రమే చెప్పానని అన్నారు. తాజాగా ఓ న్యూస్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 

‘‘చిన్నప్పుడు మా ఇంటి చుట్టుపక్కల ఎన్నో ముస్లిం కుటుంబాలు ఉండేవి. మా ఇంట్లో కూడా మిగతా పండగలతో పాటు ఈద్‌ కూడా నిర్వహించేవాళ్లం. ఈద్‌ రోజున మా ఇంట్లో వంట చేసుకునేవాళ్లం కాదు. ఆ వర్గానికి చెందిన కుటుంబాలే మాకు ఆహారం తెచ్చిఇచ్చేవి. అలాగే మొహర్రంలోనూ భాగమయ్యేవాళ్లం. అలాంటి ప్రపంచంలో నేను పెరిగాను. నా స్నేహితుల్లో చాలా మంది ముస్లింలు ఉన్నారు’’ అని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version