Telangana : బర్రెలక్కకు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ మద్దతు

-

Telangana : బర్రెలక్కకు BSP తెలంగాణ అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ మద్దతు తెలిపారు. కొల్లాపూర్ లో ఇండిపెండెంట్ అభ్యర్థి బర్రెలక్క (శిరీష) సోదరుడిపై జరిగిన దాడిని BSP తెలంగాణ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ ఖండించారు. ‘శిరీష సోదరుడిపై దాడి అత్యంత గర్హనీయం. ఈ దాడి కారకులను వెంటనే అరెస్టు చేయాలి.

 RS Praveen Kumar supports Barrelakka
RS Praveen Kumar supports Barrelakka

రాజకీయాలు కేవలం ఆధిపత్య వర్గాల వారే చేయాలా? గతంలోనూ శిరీష ఉద్యోగాలు రాక బర్రెలు కాసుకుంటున్నానని వీడియో పెట్టినందుకు ఆమెపై కేసులు పెడితే BSP మద్దతు ఇచ్చింది’ అని ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.

కాగా, తెలంగాణ బర్రెలక్క గురించి తెలియని వారుండరు. అప్పట్లో బర్రెలతో కనిపించి వైరల్‌ గా మారిన బర్రెలక్క.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో హాట్‌ టాపిక్‌ గా మారింది. అయితే… తెలంగాణ బర్రెలక్క శిరీషకు మద్దతుగా యానం మాజీ మంత్రి, ఢిల్లీ ప్రత్యేక అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు లక్ష రూపాయలు విరాళంగా పంపించారు.

Read more RELATED
Recommended to you

Latest news