కేంద్రంలోని మోదీ ప్రభుత్వం స్వార్ధ రాజకీయాలకు ఈడిని ఉపయోగించుకుంటూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్, భారాస ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు.ఏ మాత్రం ఆధారాలు లేకుండా కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేశారని అన్నారు.బహుజన వాదం, తెలంగాణ వాదం రెండు వేరు వేరు కాదన్న ఆయన రెండు పీడిత వర్గాల కోసమేనని తెలిపారు.
కేంద్రంలో బీజీపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందన్న ఆయన రాజ్యాంగం మారిస్తే ప్రజలకు స్వేచ్ఛ ఉండదని,తిరిగి చీకటి యుగంలోకి వెళ్తామని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే,రిజర్వేషన్ల రద్దు చేస్తారని,దేశం చాలా ప్రమాదంలోకి నెట్టి వేయబడుతుందని అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ,కాంగ్రెస్ లను ఓడించాలన్నారు.గురుకుల కార్యదర్శిగా నాటి ప్రభుత్వ హయాంలో ఎంతో మంది పేద పిల్లలను అంతర్జాతీయ స్థాయి విద్యను అందించేలా కృషి చేశానని తెలిపారు.